కలెక్షన్‌ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన విలక్షణ నటి మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్‌ వ్యాఖ్యతగా కూడా మంచి పేరుతెచ్చుకుంది మంచు లక్ష్మీ ఇటీవల నటిగా అవకాశాలు తగ్గిన సోషల్ మీడియాలో మాత్రం  యమా యాక్టివ్‌గా  ఉంటుంది. సామాజిక అంశాలపై తనదైన స్టైల్‌ లో స్పందించటంతో పాటు అభిమానులకు సూచనలు సలహాలు కూడా ఇస్తుంటుంది మంచు లక్ష్మీ. 

తాజాగా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న లక్ష్మీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చింటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ఆకతాయి ప్రశ్నకు తనదైన స్టైల్‌లో కౌంటర్‌ ఇచ్చింది మంచు లక్ష్మీ. నాగ్‌నాథ్‌ అనే ఓ వ్యక్తి మంచు లక్ష్మీని అక్కా అని సంబోదిస్తూ `అక్కా..  నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ షేర్‌ చేయి అక్కా` అంటూ కామెంట్‌ చేశాడు.

దీనికి కౌంటర్‌గా రిప్లై ఇచ్చిన లక్ష్మీ.. `నిజంగానా.. నీ బ్యాంక్  డిటెయిల్స్ పంపు తమ్ముడు.. ఆన్ లైన్‌ షాపింగ్ చేసుకుంటా` అంటూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం  సినిమాలకు దూరంగా ఉన్నా ప్రైవేట్‌ పార్టీస్‌, ఫంక్షన్స్‌లో ఎప్పుడు సందడి చేస్తూనే ఉంది లక్ష్మీ ప్రసన్నా. నటిగానూ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన మార్క్‌ చూపించేందుకు ప్లాన్ చేసుకుంటుంది.