మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియాలో అభిమానుల, సెలెబ్రిటీల నుంచి వెల్లువలా వస్తున్నాయి. కరోనా ప్రభావం లేకుంటే కుటుంబ సభ్యులు, ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రాంచరణ్ బర్త్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించే వాళ్ళు. కరోనా ప్రభావంతో చరణ్ సింపుల్ గా తన నివాసంలో కేక్ కట్ చేశాడు. 

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ సతీమణి ఉపాసన ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదిలా ఉండగా మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ రాంచరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందమైన ఫోటో షేర్ చేసింది. 

ఈ ఫోటోలో చరణ్, మంచు లక్ష్మీ చిరునవ్వులతో కనిపిస్తున్నారు. ఈ పిక్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల కొంత కాలంగా మెగా, మంచు కుటుంబాల మధ్య మంచి బాండింగ్ నెలకొని ఉంది. మంచు లక్ష్మి తరచుగా ఉపాసనతో పార్టీలలో, పంక్షన్స్ లో కనిపిస్తోంది. 

మంచు మనోజ్ 'అహం బ్రహ్మాస్మి' చిత్ర లాంచింగ్ కు రాంచరణ్ ప్రత్యేక అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం ఇది. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు.