స్టార్‌ వారసురాలిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన భామ మంచు లక్ష్మీప్రసన్న. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. అయితే విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న ఈ భామ సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటుంది. రాజకీయ సామాజిక్ అంశాలతో పాటు ఫన్నీ ట్వీట్‌లు చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది మంచు లక్ష్మీ.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ పాత పాటపై స్పందించి మంచు లక్ష్మీ. వినవే బర్రె పిల్లా, నువ్‌ వినవే బర్రె పిల్లా అంటూ సాగిన ఈ పాట ఇటీవల సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అయ్యింది. ఈ పాటను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన మంచు లక్ష్మీ `ఈ పాట నా బుర్ర లోంచి వెళ్లిపోవటం లేదు. అంటూ కామెంట్ చేసింది.

ఇక లాక్ డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఉంటున్న మంచు లక్ష్మీ కూతురితో కలిసి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తోంది. అంతేకాదు కరోనా విషయంలో అవగాహన కలిగించేందుకు మంచు మనోజ్‌ రూపొందించిన పాటను  మంచు లక్ష్మీ భర్త నిర్మించాడు. ఈ పాటలో లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ కూడా స్వరం కలపటం విశేషం.