మలయాళం మెగాస్టార్ మమ్ముంటి మరో హిస్టారికల్ కథతో రెడీ అవుతున్నారు. పూర్వకాలంలో సంప్రదాయా బద్ధంగా వచ్చిన మామాంగం ఉత్సవాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ని ఇటీవల రిలీజ్ చేశారు. హిస్టారికల్ కథ కావడంతో తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక టీజర్ లో పలు యాక్షన్  సీన్స్ ఆకట్టుకుంటుంన్నాయి.

మలయాళం మెగాస్టార్ తో పాటు యువ హీరో ఉన్ని ముకుందన్ కూడా ఒక యోధుడిగా కనిపించబోతున్నాడు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ పాన్ ఇండియన్ సినిమాగా ఇతర భాషల్లో కూడా డబ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మళయాళంతో పాటు తమిళ్ తెలుగు హిందీ భాషల్లో భారీగా రిలీజ్ చేయనున్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ఎమ్.పద్మ కుమార్ దర్శకత్వం వహించాడు.  మొదటి షెడ్యూల్ కి వేరే దర్శకుడు దర్శకత్వం వహించగా అనుకోని విధంగా మధ్యలో ఈ ప్రాజెక్ట్ ని పద్మకుమార్ టేకప్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా మామాంగం సినిమాను ఈ ఏడాది నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక విడుదలైన టీజర్ కి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.