'జబర్దస్త్' కామెడీ షో ఎంత పాపులరో తెలిసిందే. ఈ షో మొదలై ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. ఈ షో ద్వారా ఎందరో ఆర్టిస్ట్ లు బుల్లితెరకి పరిచయమయ్యారు.

ముఖ్యంగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను ఇలా చాలా మంది కమెడియన్లు మంచి పేరు సంపాదించుకున్నారు. కొన్ని వివాదాల్లో ఈ షో కమెడియన్ల పేర్లు వినిపించాయి. అప్పట్లో చలాకీ చంటి వాళ్లపై కొందరు దాడి కూడా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం 'జబర్దస్త్' పేరు మరింత మారుమ్రోగుతుంది.

''సెక్స్ రాకెట్ లో దొరికింది నేను కాదు.. అతడు నాలానే ఉంటాడు''

'జబర్దస్త్' కమెడియన్ దొరబాబు ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు. వైజాగ్ లో ఓ షో నిర్వహించడానికి వెళ్లిన దొరబాబు, పరదేశీ సెక్స్ రాకెట్ లో దొరకడంతో చర్చకు దారి తీసింది. పోలీసులు చెబుతోన్న వివరాల ప్రకారం ఈ సెక్స్ రాకెట్ తో వీరి కొద్దిరోజులుగా సంబంధం ఉందని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు దొరబాబు చేసిన పనికి మిగిలిన కమెడియన్లందరికీ మల్లెమాల ప్రొడక్షన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే 'జబర్దస్త్' నుండి తొలగిస్తామని చెప్పినట్లు సమాచారం. అంతేకాదు దొరబాబుని 'జబర్దస్త్' షో నుండి తొలగిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.