గబ్బర్ సింగ్ చిత్రం విడుదలై 8 ఏళ్ళు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ట్రెండింగ్ లో రికార్డ్ సృష్టించారు. గబ్బర్ సింగ్ చిత్రం 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పవన్ అభిమానులు ఏకంగా 13 మిలియన్ల ట్వీట్స్ తో మోతెక్కించారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ 28వ చిత్రం కూడా వార్తల్లో నిలిచింది. 

ఎందుకంటే గబ్బర్ సింగ్ చిత్రాన్ని తెరకెక్కించిన హరీష్ శంకర్ దర్శత్వంలో పవన్ 28వ చిత్రం ఉండబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. తాజాగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త కూడా వైరల్ అవుతోంది. పవన్, హరీష్ శంకర్ చిత్రంలో హీరోయిన్ ఎవరనే ప్రశ్న అభిమానుల్లో ఉంది. 

దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రం కోసం న్యూ ఫేస్ ని వెతుకున్నారట. ఈ క్రమంలో మలయాళీ యంగ్ బ్యూటీ మానస రాధాకృష్ణన్ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మానస ప్రస్తుతం మళయాలం, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. చూడగానే ఆకర్షించే రూపం మానస సొంతం. మానస వయసు 21 ఏళ్ళు. పవన్ ఏజ్ తో చూసుకుంటే మానస టూ యంగ్. 

అయినా కూడా హరీష్ శంకర్ ఆమె పేరు పరిశీలిస్తున్నారంటే.. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ రోల్ ఏమైనా ఉందా అనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మానస ఈ చిత్రంలో నటించేది ఒకే అయితే తెలుగులో ఆమెకు ఇదే డెబ్యూ మూవీ అవుతుంది.