మలయాళీ నటి అంజలి అమీర్ సోషల్ మీడియా వేదిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంజలి అమీర్ ఇండియాలో మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ నటి. టివి కార్యక్రమాలతో పాపులర్ అయిన అంజలి అమీర్ మలయాళీ చిత్రాల్లో కూడా నటిస్తోంది. 

స్టార్ హీరో మమ్ముట్టి నటించిన 'పెరంబు' చిత్రంలో అంజలి అమీర్ కీలక పాత్రలో నటించింది. ఆ చిత్రం అంజలికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తాజాగా అంజలి అమీర్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన ప్రియుడిపై ఆరోపణలు చేసింది. 

గత కొంతకాలంగా అంజలి అమీర్ ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. అతడు తనని వేధిస్తున్నాడని అంజలి వాపోయింది. అంతేకాక అతడి నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు కూడా ఆరోపించింది. ఇటీవలే తన ప్రియుడు మంచి వ్యక్తి కాదని అర్థం అయింది. అప్పటి నుంచి అతడికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు అంజలి పేర్కొంది. 

ఈ విషయం గ్రహించిన అతడు నన్ను వేధిస్తూ, చంపేందుకు కూడా ప్రయత్నిస్తున్నాడు అని అంజలి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నా బ్యాంక్ కథలో ఉన్న రూ 4 లక్షలని కూడా వాడేశాడు. యాసిడ్ దాడి చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక చచ్చిపోవాలని అనిపిస్తోంది అంజలి అమీర్ ఫేస్ బుక్ పేజీ లైవ్ లో పేర్కొంది. 

ఆ మధ్యన అంజలి తన జీవితంపై బయోపిక్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, నటిగా ఎలా మారింది అనే సంగతులని బయోపిక్ చిత్రంలో చూపించబోతున్నట్లు అంజలి పేర్కొంది.