హోటల్ రూమ్ లో అనుమానాస్పద స్థితిలో సీనియర్ నటుడు మృతి!
మలయాళ నటుడు దిలీప్ శంకర్ తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో విగతజీవిగా కనిపించారు. ఆయన తలకు గాయమై అంతర్గత రక్తస్రావం వల్ల మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దిలీప్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్,మలయాళ రచయిత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంటీ(MT) వాసుదేవన్ నాయర్ మరణం నుంచి ఇండస్ట్రీ కోలుకోకుండానే మరో విషాదం అలుముకుంది. మలయాళ నటుడు దిలీప్ శంకర్ ఇవాళ తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో విగతజీవిగా కనిపించాడు.
దిలీప్ శంకర్ మృతికి గల కారణాల గురించి వివరాలు తెలియరాలేదు. ఆయన గురించి స్థానిక మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. ఈ నెల 19 నుంచి దిలీప్ హోటల్‌లో ఉంటున్నాడు. హోటల్‌లో ఉంటున్న సమయంలో అతడు ఒక్కసారి కూడా తన గది నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. అతని సహనటులు అతడికి ఫోన్ చేసినప్పటికీ ఎత్తలేదు. దీంతో వారు దిలీప్ కోసం హోటల్‌కు వచ్చారు. అతడి గదిని తెరవమని హోటల్ సిబ్బందిని కోరారు.
ఆ తర్వాత గది తెరచి చూస్తే అందులో దిలీప్ విగతజీవిగా కనపడ్డాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. శంకర్ తలకు గాయం ఉందని పోలీసులు తెలిపారు. అంతర్గత రక్తస్రావం వల్ల మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు మీడియాకు తెలిపారు.
ఇక టెలివిజన్ సిరీస్ పంచాగ్ని షూటింగ్ కోసం దిలీప్ శంకర్ కొన్ని రోజులుగా తిరువనంతపురంలో ఉన్నారని తెలుస్తోంది. దిలీప్ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని షో డైరెక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దిలీప్ శంకర్ స్వస్థలం చిత్తూరు, దక్షిణ ఎర్నాకులం.
దిలీప్ అనారోగ్యంతో పోరాడుతూ చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. దిలీప్ శంకర్ మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం హోటల్ వద్దకు చేరుకున్న అతడు ఉన్న గదిని పరిశీలించింది. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత అతడి మరణానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీస్ లు చెప్తున్నారు. ట
మరోపక్క కొన్నాళ్లుగా దిలీప్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ‘పంచాగ్ని’ టీవీ సీరియల్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. పోలీసులు దిలీప్ మరణంపై ఎంక్వైరీ మొదలుపెట్టారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.