వరల్డ్ వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. బాలీవుడ్ నుంచి సౌత్ కి వచ్చిన బిగ్ బాస్ ప్రతి సీజన్ లో రియాలిటీ డోస్ పెంచుతున్నాడు. ఇప్పటికే తమిళ్ మరో సీజన్ ని పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం బాలీవుడ్ - టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మరో రెండు వారాల్లో తెలుగు బిగ్ బాస్ ఫైనల్ ట్రాక్ కి వచ్చేస్తుంది.

ఇక ఇప్పుడు మలయాళంలో రెండవ సీజన్ మొదలు కాబోతోంది.  అయితే మొదటి సీజన్ కి హోస్ట్ గ వ్యవహరించిన మోహన్ లాల్ రెండవ సీజన్ లో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తన పంచ్ లతో ఫస్ట్ సీజన్ ని సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేశారు. యాక్టర్ గానే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఆయన టాలెంట్ నీ నిరూపించుకున్నారు.

అందుకే మలయాళం బిగ్ బాస్ షో నిర్వాహకులు మరోసారి ఆయనను హోస్ట్ గా  ఫిక్స్ చేశారు.  ఈ విషయంపై గత గొంత కాలంగా అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హోస్ట్ గా వేరే హీరోల లిస్ట్ ఆడియెన్స్ ని కాస్త కన్ఫ్యూజన్ కి గురి చేసింది.

ఇక ఫైనల్ గా బిగ్ బాస్ 2కి కూడా మోహన్ లాల్ రాబోతున్నట్లు తెలిసిపోయింది. చెన్నై లో బిగ్ బాస్  సెట్ ని నిర్మించినట్లు సమాచారం. సబుమోన్ అబ్దుసమద్ మొదటి మలయాళం బిగ్ బాస్ లో విన్నర్ గా నిలిచాడు. మరి ఈ సారి ఎవరు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారో చూడాలి.

మోహన్ లాల్ కి శత్రువైన సల్మాన్ బ్రదర్!