Asianet News TeluguAsianet News Telugu

'ఉప్పెన' బిజినెస్: డైలమాలో డిస్ట్రిబ్యూటర్స్

త్వరలో ఓ జాలరి...ఉప్పెనై బాక్సాఫీస్‌ మీదకు దండెత్తబోతున్న సంగతి తెలిసిందే.   చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయమవుతూ ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. 

Makers of Uppena demanding big money
Author
Hyderabad, First Published Feb 23, 2020, 12:38 PM IST

త్వరలో ఓ జాలరి...ఉప్పెనై బాక్సాఫీస్‌ మీదకు దండెత్తబోతున్న సంగతి తెలిసిందే.   చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయమవుతూ ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. సుకుమార్‌ శిష్యుడు బచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న తొలి చిత్రమిది. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో హీరో ప్రేమ కోసం ఉప్పెనగా మారే ‘జాలరి గా కనిపించనున్నారు.

 వైష్ణవ్‌ తేజ్‌కు హీరోగా తొలి చిత్రమే అయినప్పటికీ.. సినిమా మాత్రం అది ఎక్కడ కనపడనివ్వకుండా అదరకొట్టేసాడని వార్తలు వస్తున్నాయి. రంగస్దలం తరహాలో డ్రామాతో కూడిన రొమాంటిక్ చిత్రం ఇది అని తెలుస్తోంది. ఈ సినిమాపై నిర్మాతలు పూర్తి నమ్మకంతో ఉన్నారు. దాంతో ఈ చిత్రంకు సంభందించిన ఏరియా రైట్స్ ఓ రేంజిలో చెప్తున్నట్లు సమాచారం.

అయితే హీరో కొత్తవాడు కావటం, డైరక్టర్ కొత్త కుర్రాడే కావటంతో సినిమా ఎలా ఉండబోతోందా అనే విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ కంక్లూజన్ కు రాలేకపోతున్నారట. దానికి తోడు ప్రమోషన్స్ కూడా ఇంకా ఊపందుకోలేదు. టీజర్, ట్రైలర్ బయిటకు రాలేదు. కేవలం పోస్టర్స్ తోనే బిజినెస్ చేసే ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ చూసి కాస్త తక్కువ రేట్లనే కోట్ చేస్తున్నారట డిస్ట్రిబ్యూటర్స్. అయితే అంత తక్కువకు ఇచ్చేది లేదని, అవసరం అనుకుంటే ముఖ్యమైన ఏరియాలు తామే సొంతగా రిలీజ్ చేస్తామని థీమాగా నిర్మాతలు చెప్తున్నారట.

సముద్ర తీర ప్రాంతంలో జాలరుల జీవిత విధానాన్ని ప్రతిబింబిస్తూ సాగే ప్రేమకథగా ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో హీరో,హీరోయిన్స్ ప్రేమలో పడటం వరకూ ఒక విధంగా సాగిన కథ, హీరోయిన్ తండ్రిగా విజయ్ సేతుపతి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక రేంజ్ కి వెళుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ .. ప్రీ క్లైమాక్స్ ఉత్కంఠను రేకెత్తిస్తాయని చెబుతున్నారు. విలన్ గా 'రాయనం' పాత్రలో విజయ్ సేతుపతి నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తొల సినిమానే కానీ, నటుడిగా మాత్రం మొదటి సినిమా కాదు. ఎందుకంటే వైష్ణవ్‌ గతంలో తన మేనమామ చిరు హీరోగా నటించిన ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’లో బాల నటుడిగా కనిపించాడు. ఆ సినిమాలో చైర్‌లో కూర్చొని ఉండే మతిస్థిమితం లేని బాలుడు వైష్ణవే. దీని తర్వాత పవర్‌ స్టార్‌ హీరోగా నటించిన ‘పంజా’లోనూ కీలక పాత్రలో తళుక్కున మెరిశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios