సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త యాంగిల్ లో కనిపించి సక్సెస్ అందుకున్న మహేష్ నెక్స్ట్ ఇంకాస్త పెద్ద సినిమాలతో హిట్స్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.   మహేష్ నెక్స్ట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో వర్క్ చేయలని అనుకున్నాడు.

కానీ ఆ సినిమా సడన్ గా క్యాన్సిల్ అయ్యింది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన పనులపై మహేష్ ఎక్కువగా ద్రుష్టి పెట్టడం లేదు. హాలిడేస్ ని ఎక్కువగా ఎంజాయ్ చేసే మహేష్ ఎవరు ఊహించని విధంగా ఆత్యాద్మిక చింతన వైపు మళ్లాడు. స్టార్ హిరోస్ లో ఎక్కువగా రజినీకాంత్ హిమాలయాల వైవు వెళుతుంటారు.  ఇక ఇప్పుడు మహేష్ బాబు ఆ వైపు అడుగులు వేస్తున్నాడు. అక్కడ కొంత సేపు తపస్సు చేసి ఆత్యాద్మిక చింతన వైపు మనసును మళ్లించనున్నాడట.

ఇక ఆ తరువాత మహేష్ వెంటనే రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తేవాలని ట్రై చేస్తున్నాడు. అందులో ఒక సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.  KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ గత కొన్ని వారల క్రితం మహేష్ కి ఒక కథ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం KGF 2 తో బిజీగా ఉన్న ప్రశాంత్ ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే మహేష్ సినిమాని స్టార్ట్ చేయాలనీ చూస్తున్నాడు. ఇక మహేష్ - ప్రశాంత్ కాంబినేషన్ లో తెరక్కనున్న సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించే అవకాశం ఉందని సమాచారం. మరీ ఆ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.