బిగ్ బాస్ తెలుగు వెర్షన్ సీజన్ 3 మరో రెండు వారాల్లో పూర్తి కానుంది. ఇక ఈ వారం హౌస్ నుండి ఓ వ్యక్తి ఎలిమినేట్ కానున్నాడు. ఈసారి మహేష్, రాహుల్, వరుణ్, వితికాలు నామినేట్ అయితే వితికా తన మెడాలియన్ ఆఫ్ గోల్డ్ గెలుచుకోవడంతో తన స్పెషల్ పవర్ ఉపయోగించి ఎలిమినేషన్ నుండి తప్పించుకుంది.

ఇక మిగిలిన ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నరనే విషయం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియా ట్రెండ్స్ ని బట్టి చూస్తుంటే ఎక్కువ మంది మహేష్ విట్టా ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. మొదటినుండి హౌస్ లో మహేష్ హౌస్ మేట్స్ మధ్య పుల్లలు పెడుతున్నాడని, హౌస్ లో నారదుడిలా తయారయ్యాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మహేష్ కూడా దానికి తగ్గట్లే ప్రవర్తిస్తుంటాడు. అక్కడ విషయాలు ఇక్కడ.. ఇక్కడ విషయాలు అక్కడ చెబుతూ పుల్లలు పెడుతున్నాడు. దీంతో ఈ వారం అతడు హౌస్ నుండి బయటకి వెళ్లడం ఖాయమని అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఈసారి ఓటింగ్ కాస్త డిఫరెంట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది.

మహేష్ ని కొంతకాలంగా ఒక ప్రాంతీయ వర్గం సపోర్ట్ చేస్తూ వస్తున్నట్లు ఓటింగ్ ట్రెండ్స్ చెబుతున్నాయి. మహేష్ కడప జిల్లా ప్రొద్దుటూరు కి చెందిన వ్యక్తి. అక్కడి వారు మహేష్ కి ఓట్లు వేసి ఎలిమినేషన్ నుండి సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. అదే గనుక జరిగితే వరుణ్, మహేష్, రాహుల్ లలో రాహుల్ ఎలిమినేట్ కాక తప్పదని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!