బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ విషయంలో ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ వారం నామినేషన్ లో రాహుల్, మహేష్, వరుణ్ ఉన్నారు.ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున ఎప్పటిలాగే ఉత్సాహభరితంగా ఎంటర్ అయ్యారు.

నాగార్జున వేదికపైకి రాగానే బాబా భాస్కర్ విషయాన్ని ప్రస్తావించారు. ఎందుకు అంతలా ఎమోషనల్ అవుతున్నారు అని నాగార్జున ప్రశ్నించారు. తనని కావాలనే కార్నర్ చేస్తున్నారని బాబా భాస్కర్ వాపోయారు. నాగార్జున ఎదుట కంటతడి పెట్టుకున్నారు. తాను ఎలాంటి స్ట్రాటజీతో హౌస్ లోకి రాలేదని బాబా తెలిపాడు. 

నాగార్జున చొరవతీసుకుని బాబా భాస్కర్ ని సముదాయించారు. ఆ తర్వాత షో సరదాగా సాగింది. నాగార్జున ఇంటి సభ్యులని రెండు టీంలుగా విభజించి సరదా గేమ్ ఆడించారు. సినిమా పేరుని ఒకరు బొమ్మరూపంలో తెలియజేస్తే అతడి టీం సభ్యులు ఆ చిత్రం ఏదో కనుక్కోవాలి. 

ఈ గేమ్ సరదాగా సాగింది. ఈ గేమ్ తర్వాత ఇంటి సభ్యులని కొన్ని సరదా ప్రశ్నలు అడిగారు. మధ్యలో నామినేషన్ లో ఉన్న రాహుల్ సేవ్ అవుతున్నట్లు నాగ్ ప్రకటించారు. చివరకు వరుణ్, మహేష్ నామినేషన్ లో మిగిలారు. 

ఉత్కంఠకు తెరదించుతూ మహేష్ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. మహేష్ ఎలిమినేషన్ తో హౌస్ లో 7 మంది సభ్యులు మాత్రమే మిగిలిగారు. నాగార్జున వద్దకు వేదికపైకి వెళ్లిన మహేష్ తన దృష్టిలో హౌస్ లో బాబా భాస్కర్ నెం 1 అని కితాబిచ్చాడు.