మహేష్ తో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం మహేష్ తో నటించడానికి కథలో కండిషన్స్ లేకుండా ఒప్పుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీలు సైతం తెలుగులో సినిమా చేస్తే. మహేష్ తోనే చేయాలనీ ఆలోచిస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రస్తుతం మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ల వేట మొదలైంది.

దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న మహేష్ తదుపరి సినిమా షూటింగ్ సమ్మర్ లో స్టార్ట్ కానుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ ఈ ప్రాజెక్ట్ లో చాలా కొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా మహేష్ కి జోడి కట్టెదవారనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటె ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత గట్టిగానే ఉంది. ఫామ్ లో ఉన్న ఇద్దరి ముగ్గురితో మహేష్ ఇది వరకే చేశాడు.  ఇక కాజల్ - తమన్నా లాంటి వాళ్ళతో చేయలేని పరిస్థితి. మొత్తంగా మహేష్ కి ఇప్పుడు హీరోయిన్ దొరకడం చాలా కష్టంగా మారింది.

అందుకే మళ్ళీ బాలీవుడ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను సినిమాలో నటించిన కియారా అద్వానీ మళ్ళీ మహేష్ తో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులయూ మొదలుపెట్టిన వంశీ వీలైనంత త్వరగా హీరోయిన్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటున్నాడు. మరీ 'భరత్ అనే నేను' సినిమాతో హిట్టందుకున్న మహేష్ - కియారా జోడి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.