Asianet News TeluguAsianet News Telugu

SSMB28:మహేష్, త్రివిక్రమ్ మూవీ నుంచి అదిరిపోయే ఆప్డేట్

మహేష్, త్రివిక్రమ్ కిలిసి చేస్తున్న మూడవ సినిమా ఇది. గతంలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ రెండు సినిమాలతో దర్శకుడు త్రివిక్రమ్..మహేష్‌కి హిట్స్ ఇవ్వలేకపోయారు. దాంతో ఈ సారి చేస్తున్న మూడవ సినిమా SSMB 28 తో భారీ హిట్ ఇవ్వాలని కసిగా ఉన్నారు.

Mahesh, Trivikram movie to start regular shoot on Sep 8
Author
First Published Aug 30, 2022, 8:53 AM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)తో ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలసిందే. ఇటీవలే ఫైనల్ స్క్రిప్ట్‌ను కూడా త్రివిక్రమ్..మహేష్‌కు వినిపించాడు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సలహాలు ఇవ్వగా..ఇప్పుడు వాటి మార్పులు చేర్పులపై వర్క్ చేసి స్క్రిప్టు లాక్ చేసారు త్రివిక్రమ్.

వాస్తవానికి సర్కారు వారి పాట రిలీజైన వెంటనే మహేష్ - త్రివిక్రమ్ మూవీ త్వరగానే సెట్స్‌పైకి వస్తుందని భావించారు. కానీ, మహేష్  సూచించిన సలహాలతో ఇంకాస్త స్క్రిప్ట్ కోసమే సమయం పడుతోందని సమాచారం. కానీ, ఫ్యాన్స్ మాత్రం ఆగడం లేదు. త్వరగా ఈ మూవీ అప్‌డేట్స్ కావాలి.. అంటూ సోషల్ మీడియాలో మేకర్స్‌ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు మహేష్ అభిమానులు ట్వీట్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు ఆనందపడే ఓ అప్డేట్ బయిటకు వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 8 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి రెగ్యులర్ షూట్ హైదరాబాద్ లో వేసిన సెట్ లో జరగనుంది. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ లో పూజ హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది.ఆమె సెకండ్ షెడ్యూల్ నుంచి షూట్ లో పాల్గొనబోతోంది.

ఈ మూవీకి సంబంధించిన ప్రతీదీ ఎంతో గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే యాక్షన్ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే, యాక్షన్స్ సీన్స్ కంపోజ్ చేయడానికి కేజీఎఫ్ చిత్రాల ఫైట్ మాస్టర్స్ అన్‌బు (Anbu)- అరివు (Arivu)లను త్రివిక్రమ్ ఎంచుకున్నారు. వారు భారీ యాక్షన్ సీన్స్ ని  హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకు మహేష్ సినిమాలో చూడని ఫైట్స్‌ను ఈ సినిమాలో చూడబోతున్నట్టు సమాచారం.

ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కెజీఎఫ్, కెజీఎఫ్ 2, విక్రమ్, లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సాలీడ్‌గా ఉండే యాక్షన్ సీక్వెన్స్ అందించిన అన్‌బు - అరివు..ఇప్పుడు మహేష్ సినిమాలో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నారో చూడాలి. 

 చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) మాట్లాడుతూ...దాదాపు 12 ఏళ్ళు తర్వాత మహేష్ గారు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. అలాంటి సినిమాకి ప్రతీది స్పెషల్‌గానే ఉండాలి. కాబట్టి అలాంటి అప్డేట్స్‌ను స్పెషల్ డే కి ప్లాన్ చేసి రిలీజ్ చేస్తాము.. ఖచ్చితంగా మహేష్ - త్రివిక్రమ్ కాంబో చిత్రం అందరికీ ఒక మరపురాని సినిమాగా నిలుస్తుంది'.. అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios