టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రాబోతున్న మరో బిగ్ బడ్జెట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. గత కొన్నాళ్లుగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ సినిమాపై ప్రత్యేకమైన బజ్ నెలకొంది. ప్రస్తుతం సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే సినిమాలోని పాటలు ఒక క్రేజ్ క్రియేట్ చేయగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ డోస్ మరింత పెంచాలని మహేష్ గ్యాంగ్ ప్లాన్ చేసుకుంటోంది. ముఖ్యంగా మహేష్ ఈ ఈవెంట్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటె ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్న విషయం తెలిసిందే.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ నెల 5న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు హోస్ట్ గా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కి అభిమానులు భారీ సంఖ్యలో రాబోతున్నారు. దీంతో గత రెండు రోజుల నుంచే ఈవెంట్ నిర్వాహకులు పనులు మొదలుపెట్టారు. ఇక ఈవెంట్ లో యాంకర్ ఉన్నప్పటికీ దాదాపు మహేష్ హోస్టింగ్ తోనే స్టేజ్ మెరవనుందని సమాచారం. వచ్చిన అతిధులను మహేష్ స్పెషల్ గా ఇన్వైట్ చేసి స్టేజ్ పైకి ఆహ్వానిస్తారట. అలాగే మధ్య మధ్యలో పంచ్ లు కూడా పేలతాయని తెలుస్తోంది. మహేష్ హోస్టింగ్ కి దర్శకుడు అనిల్ రావిపూడి వెనకుండి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరి మహేష్ ఆడియెన్స్ ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.