టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ మూవీ సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత మహేష్ ఫుల్ ఎంటర్టైన్ రోల్ తో అలరించనున్నాడు. సినిమాకు సంబందించిన టీజర్ ఇప్పటికే ఆడియెన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక సాంగ్స్ మాత్రం అనుకున్నంతగా క్రేజ్ దక్కించుకోలేదు.

దేవి శ్రీ ఇచ్చిన ట్యూన్స్ అంతగా వర్కౌట్ కాలేదని టాక్ వస్తోంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ పై ట్రోలింగ్ గట్టిగా నడిచింది. అయితే ఆ సాంగ్ మ్యూజిక్ ఎలా ఉన్నా కూడా వెండితెరపై మాత్రం ఆడియెన్స్ కి సరికొత్త కిక్ ఇస్తాయని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.సినిమ షూటింగ్ కి సంబందించిన ఒక వీడియో ఇటీవల లీక్ అయ్యింది.

ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఎందుకంటె మహేష్ లుంగీలో సరికొత్త స్టెప్పులు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.  గతంలో కొన్ని సినిమాల్లో మహేష్ లుంగీలో కనిపించి ఆడియెన్స్ మంచి కిక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అదే తరహాలో ట్రై చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

2019లో 100కోట్ల సినిమాలు.. నెగిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైంది!

కొన్ని పాటలు విన్నప్పుడు బాగోలేకపోయినా స్క్రీన్ పై కొన్నిసార్లు వాటి మేకింగ్ వల్ల నచ్చేస్తుంటాయి. ఈ సాంగ్ కూడా అలానే ఆకట్టుకుంటుందని టాక్ వస్తోంది. మరి మహేష్ ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాబోతోంది. దిల్ రాజు- అనిల్ సుంకర మహేష్ తో కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.