ఇష్టమైన హీరో సీనియా విడుదలకు సిద్దమవుతోంది అంటే చాలు అభిమానుల మధ్య జోష్ ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సంక్రాంతికి విడుదల కానున్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద యుద్దానికి దిగనున్నాయి. అల్లు అర్జున్ "అల వైకుంఠపురములో.." - "మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు" సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

రెండు సినిమాలపై అంచనాలు ఒకే రేంజ్ లో ఉన్నాయి అనుకుంటే పొరపాటే అవుతోంది. ఎందుకంటె ఒకదానికి మించి మరొకటి ప్రమోషన్స్ లో సత్తా చాటుతున్నాయి. మొదట రెండు పాటలతో బన్నీ తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. 'సామజవరగమన - రాములో రాములో' రెండు పాటలు కూడా యూ ట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే మొదట మహేష్ రెండు పాటలతో బన్నీకి పోటీని ఇవ్వలేకపోయాడు.  దీంతో అభిమానుల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలైంది. హీరోలు కూడా ఆ గొడవలపై పెద్దగా పట్టించుకోకుండా ఎవరి దారిలో వారు ప్రమోషన్ డోస్ పెంచారు. ఇక మహేష్ ఇటీవల 'అల వైకుంఠపురములో' టీమ్ ని ఒక టీజర్ తో కొట్టేశాడు.

తమన్నా తో 'డాంగ్ డాంగ్' అనే సాంగ్ లో స్టెప్పులేసి టీజర్ వదిలిన ప్రిన్స్ యూ ట్యూబ్ లో 24 గంటల్లో 182లైకులను అందుకున్నాడు. బన్నీ రాములో రాములో సాంగ్ పేరిట ఉన్న రికార్డును (164లైకులు) మహేష్ అధిగమించాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఇరు వర్గాల మధ్యన ఉన్న వార్ కి ఈ రికార్డు మరింత బూస్ట్ ఇచ్చింది. రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో వార్ కొనసాగుతోంది అంటే విడుదలయ్యాక డోస్ ఇంకెంత పెరుగుతోందో చూడాలి.