గీతగోవిందం సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి వెళ్లిన డైరెక్టర్ పరశురామ్ మరొక సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫైనల్ గా నాగచైతన్య తో ఒక స్క్రిప్ట్ ను పట్టాలెక్కించిన పరశురామ్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ దర్శకుడు కొంతమంది స్టార్ డైరెక్టర్స్ కి కథలు వినిపించాడు.

అయితే రీసెంట్ గా మహేష్ నుంచి  పరశురామ్ కి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల మహేష్ వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. స్క్రిప్ట్ విషయంలో మహేష్ కి కాస్త అనుమానాలు చెలరేగడంతో వెంటనే ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్లు టాక్ వచ్చింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపని మహేష్ పరశురామ్ ని లైన్ లో పెట్టినట్లు టాక్.

గతంలోనే గీత గోవిందం దర్శకుడు మహేష్ కి ఒక లైన్ వినిపించాడు. ఇక రీసెంట్ గా మరొకసారి ఫుల్ స్క్రిప్ట్ నరేట్ చేయడంతో సినిమాను స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నాడట. దీంతో పరశురామ్ చైతూతో చేయాల్సిన ప్రాజెక్ట్ ని హోల్డ్ లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడని వినికిడి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.