సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ రోల్ లో కనిపించబోతున్నాడు.

 అయితే ఈ సినిమా అనంతరం మహేష్ ఎవరితో వర్క్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అసలైతే సుకుమార్ తో చేయాల్సింది. సుకుమార్ సెట్ చేసుకున్న కథలో పదే పదే మార్పులు చేయమని అడగడంతో విసుగుతో అతను బన్నీకి కమిట్ అయ్యాడు. దీంతో మహేష్ నెక్స్ట్ కొంతమంది దర్శకులను లైన్ లో పెట్టాడు. అందులో మహేష్ కి దర్శకులు చెప్పిన కథలు పెద్దగా నచ్చలేవట.

సందీప్ వంగ - పరశురామ్ మహేష్ తో చేయాలనీ చాలా ప్రయత్నించారు. కానీ మహేష్ వారి స్క్రిప్ట్ లను ఆరెంజ్ సిగ్నల్ లో ఉంచడంతో దర్శకులకు ఓపిక నశించి వేరే హీరోలను లైన్ లో పెట్టుకున్నారు.  ఇక చేసేదేమి లేక వంశీ పైడిపల్లితోనే మరో సినిమా చేయడానికి మహేష్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక గ్యాంగ్ స్టర్ పాయింట్ ని వినిపించిన వంశీ.. మహేష్ ని మెప్పించాడట.

వెంటనే కథను డెవలప్ చేయమని చెప్పడంతో వంశీ మూడు నెలల టైమ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ లోపు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తే దిల్ రాజు ప్రొడక్షన్ లో వెంటనే సినిమా షూటింగ్ ని కూడా లాంచ్ చేయాలనీ మహేష్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాక్. మరో సెకండ్ టైమ్ కలుస్తున్న ఈ మహర్షి కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.