టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి ఫైట్ కి సాలిడ్ గా సిద్దమవుతున్నాడు. డిసెంబర్ నుంచి మహేష్ బరిలోకి దిగాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్న మహేష్ సరిలేలు నీకెవ్వరు సినిమాకు అసలైన ప్రమోషన్స్ ని మాత్రం కాస్త ఆలస్యంగానే మొదలుపెట్టనున్నాడట.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పటికే సినిమాకు సంబందించిన షూటింగ్ ఫైనల్ పార్ట్ కి చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. విజయశాంతికి సంబందించిన లుక్ ని దీపావళి సందర్బంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ లుక్ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే నవంబర్ లో చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ కానుంది.  ఇక మహేష్ మాత్రం డిసెంబర్ నుంచి తన అసలైన ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయనున్నాడట. సినిమాలో నటించిన కమెడియన్స్ ని మహేష్ స్పెషల్ ఇంటర్వ్యూ చేననున్నట్లు తెలుస్తోంది.  సంక్రాంతికి అల్లు అర్జున్ ఆలా వైకుంఠపురములో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

దాదాపు మహేష్ సినిమాతో సరిసమానంగా బన్నీ సినిమా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కలెక్షన్స్ ఎంత లాగినా.. ఆ సంక్రాంతి మూమెంట్ లోనే వసూలు సాధించాలని మహేష్ స్పెషల్ ప్లాన్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమా ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం తగ్గకూడదని దిల్ రాజు కూడా చిత్ర యూనిట్ తో డిస్కస్ చేస్తున్నారట. మొతానికి ఈ సంక్రాంతికి అల వైకుంఠపురములో - సరిలేరు నీకెవ్వరు సినిమాలకు మధ్య పోటీ చాలా స్ట్రాంగ్ ఉన్నట్లు అర్ధమవుతోంది.