Asianet News TeluguAsianet News Telugu

మహేష్ మేనల్లుడి లాంచ్.. స్పెషల్ గెస్ట్ గా మెగా హీరో

మహేష్ ఫ్యామిలీ నుంచి కుర్ర హీరో వెండితెరపైకి రాబోతున్నాడు. ప్రిన్స్ మేనల్లుడు గల్లా అశోక్ మొదటి సినిమా లాంచ్ ఈవెంట్ ఆదివారం జరగనుంది. అట్టహాసంగా జరగనున్న ఈ వేడుకకు చాలా మంది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక మెగా హీరో వేడుకలో స్పెషల్ గెస్ట్ గా మెరవనున్నట్లు తెలుస్తోంది.

mahesh nephew ashok galla launch event special guest
Author
Hyderabad, First Published Nov 9, 2019, 8:36 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టాలీవుడ్ సువర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ నుంచి కుర్ర హీరో వెండితెరపైకి రాబోతున్నాడు. ప్రిన్స్ మేనల్లుడు గల్లా అశోక్ మొదటి సినిమా లాంచ్ ఈవెంట్ ఆదివారం జరగనుంది. అట్టహాసంగా జరగనున్న ఈ వేడుకకు చాలా మంది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

ఇక మెగా హీరో వేడుకలో స్పెషల్ గెస్ట్ గా మెరవనున్నట్లు తెలుస్తోంది.  అతను మరెవరో కాదు. మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆదివారం అశోక్ మొదటి సినిమా పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది. ఈ కార్యక్రమానికి రావడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

mahesh nephew ashok galla launch event special guest

గత కొన్నేళ్లుగా అశోక్ గల్లా ఫ్యామిలీకి రామ్ చరణ్ చాలా దగ్గరగా ఉంటున్నాడు. గుంటూరు పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా రామ్ చరణ్ ని లాంచ్ ఈవెంట్ కి స్పెషల్ గా ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది.  

ఇక సినిమా విషయానికి వస్తే.. గతకొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ కి ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. సినిమాలో ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అశోక్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోందట. ఇక నిధి అగర్వాల్ ఈ హీరోకి పర్ఫెక్ట్ జోడి అని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.

mahesh nephew ashok galla launch event special guest

అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో న‌వంబ‌ర్ 10న  ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించనున్నారు. సినీ ప్ర‌ముఖులు అలాగే పలువురు రాజకీయనాయకులు హాజ‌రవుతున్నారు. త‌న‌దైన స్టైల్లో డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios