సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త  చిత్రానికి రంగం సిద్ధం అయింది. ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు. సరిలేరు నీకెవ్వరు విడుదలైనప్పటి నుంచి మహేష్ తన సమయాన్ని పూర్తిగా కుటుంబ సభ్యులకే కేటాయించాడు. 

కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా మహేష్ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో మహేష్ బాబు అనేక కథలు వింటూ వచ్చాడు. గీతగోవిందం దర్శకుడు పరుశురామ్ మహేష్ తో చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కు కూడా కథ నచ్చింది. 

కానీ కొన్ని మార్పులు చేర్పుల కారణంగా వీరిద్దరి కాంబినేషన్ ప్రకటన ఆలస్యం అవుతూ వచ్చింది. మొత్తంగా పరుశురామ్ మహేష్ ని సంతృప్తి పరిచే విధంగా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయడంతో అధికారక ప్రకటన వచ్చేసింది. నేడు సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కావడంతో మహేష్ బాబు అభిమానులకు కానుక అందించాడు. 

 

ఈ చిత్రానికి ల'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంతే కాదు పరుశురామ్ ఈ చిత్రంలో మహేష్ బాబుని మునుపెన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేయబోతున్నట్లు అర్థం అవుతోంది. టైటిల్ లోగోలో మహేష్ బాబు ప్రీలుక్ సర్ ప్రైజ్ చేసే విధంగా ఉంది. 

మహేష్ బాబు చెవిపోగుతో, మెడపై రూపాయి టాటూతో కనిపిస్తున్నాడు. ఈ చిత్రం పొలిటికల్ సెటైర్ గా ఉండబోతోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ ఏ చిత్రానికి సంగీత దర్శకుడు.