మహేష్ బాబుకు తన తల్లితో ఉన్న ఎటాచ్‌మెంట్ గురించి ఇండస్ట్రీ అప్‌డేట్స్ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న బాగా తెలుసు. మహేష్ చిన్నతనంలో ఎక్కువగా కాలం తల్లి దగ్గరే పెరిగాడు. అందుకే ఆయన తల్లి, అమ్మమ్మలతో  ఎంతో అటాచ్‌మెంట్‌ పెంచుకున్నాడు. 

సోమవారం సూపర్‌ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ తన తల్లికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ వేడుకలతో తన తల్లితో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసిన మహేష్ బాబు తనదైన స్టైల్ లో శుభాంకాక్షలు తెలియజేశాడు. `ఏప్రిల్ 20 నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తికి ప్రత్యేకమైన రోజు. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ` అంటూ కామెంట్ చేశాడు మహేష్.

మహేష్ బాబుకు తన తల్లితో ఉన్న ఎటాచ్‌మెంట్ గురించి ఇండస్ట్రీ అప్‌డేట్స్ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న బాగా తెలుసు. మహేష్ చిన్నతనంలో ఎక్కువగా కాలం తల్లి దగ్గరే పెరిగాడు. అందుకే ఆయన తల్లి, అమ్మమ్మలతో ఎంతో అటాచ్‌మెంట్‌ పెంచుకున్నాడు. గతంలో అతిథి సినిమా సమయంలో అమ్మమ్మ మరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన మహేష్ కొంత కాలం సినిమాలు కూడా చేయలేదు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేష్‌. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ తన ఖాతాలో వేసుకున్న మహేష్ తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. ముందుగా వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నట్టుగా చెప్పినా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. తాజాగా పరుశురామ్ దర్శకత్వంలో మహేష్‌ ఓ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Scroll to load tweet…