ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవమైన శ్రీ లక్శ్మి వరహా నృశింహస్వామిని ఆదివారంనాడు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. సూపర్ స్టార్ మహెష్ బాబుతో ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సంక్రాంతికి విడుదలవుతుండటంతో చిత్రవిజయాన్ని కాంక్షిస్తూ అప్పన్న దర్శనం కోసం కొండకు విచ్చేసిన దర్శకునికి ఆలయవర్గాలు మర్యాదపూర్వకంగా అహ్వానించి పూజలు చేయించారు.

ముందుగా దర్శకులు కప్పస్తంబాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపంచుట్టు ప్రదక్షణలు చేసారు. పిదప అర్చకస్వాములు అనిల్ గోత్రనామాలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిదర్శనం చేసుకున్న దర్శకునికి స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఎక్స్‌పోజింగ్‌ కోసమే రష్మిని వాడుకుంటున్నారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ఆలయం వెలుపల దర్శకుడిని గుర్తించిన సినీ అభిమానులు అనిల్ రావిపూడితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. మరోపక్క హీరో మహేష్ బాబు ఆదివారం నాడు షిర్డీ సాయినాథుని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో మహేష్ ని చూసిన అభిమానులు ఆయనతో కలిసి ఫోటోలు దిగడానికి ఉత్సాహపడ్డారు.

మరికొందరు అభిమానులు ఆయనతో కలిసి ఫోటోలు తీసుకున్నారు. అభిమానుల తాకిడి దృష్టిలో ఉంచుకొని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.