మహర్షి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అంతకంటే హై రేంజ్ లో సక్సెస్ అందుకునేందుకు సిద్దమయ్యాడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న "సరిలేరు నీకెవ్వరు" సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన సాంగ్స్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇకపోతే ఈ సినిమా అనంతరం సూపర్ స్టార్ నెక్స్ట్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. మొన్నటివరకు మహేష్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై అనేక రకాల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా వంశీ పైడిపల్లి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వడంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకముందే మరొక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మహేష్ సరసన సీనియర్ హీరో కూతురు రెండవసారి రొమాన్స్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. ఆమె మరెవరో కాదు. ఇదివరకే మహేష్ శ్రీమంతుడు సినిమాలో నటించిన కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. గత కొంత కాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉంటున్న ఈ ముద్దగుమ్మ మంచి కథల కోసం ఎదురుచూస్తోంది.

ఫైనల్ గా రవితేజ క్రాక్ సినిమా చేయడానికి ఒప్పుకున్నా విషయం తెలిసిందే. అలాగే మరోసారి మహేష్ తో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గ్యాంగ్ స్టర్ మాఫియా నేపథ్యంలో వంశీ పైడిపల్లి కథను సెట్ చేసుకున్నట్లు టాక్. మహేష్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి అనంతరం ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.