. "థాంక్యూ సో మచ్ అన్నా" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్ బాబు వంటి అగ్రహీరో తమ చిత్రం టీజర్ విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
దుల్కర్ సల్మాన్ మెల్లిమెల్లిగా తెలుగు హీరోగా మారిపోతున్నారు. ఆయన సినిమాలు ఇక్కడా రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఆయన నటిస్తున్న ‘కింగ్ ఆఫ్ కోటా’ సినిమా టీజర్ విడుదలైంది. మొత్తంగా ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఇది వస్తోంది. కాగా, నేడు (జూలై 28) కింగ్ ఆఫ్ కోటా మూవీ టీజర్ విడుదలైంది. మలయాళం టీజర్‌ను దుల్కర్ తండ్రి, సీనియర్ హీరో మమ్మూట్టి లాంచ్ చేశాడు. తెలుగు టీజర్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశాడు. ఈ కింగ్ ఆఫ్ కోటా టీజర్ చాలా పవర్‌ఫుల్‍గా, ఇంటెన్స్‌గా ఉంది.
“రాజు గారు తిరిగి వచ్చేశారు” అనే డైలాగ్ వచ్చాక దుల్కర్ ఎంట్రీ ఉంది. కోటా ఊర్లో ప్రజలను విలన్ల నుంచి రక్షించే గ్యాంగ్‍స్టర్‌గా దుల్కర్ నటిస్తున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది.
దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న చిత్రం 'కింగ్ ఆఫ్ కోటా'. తాజాగా ఈ చిత్రం టీజర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. 'కింగ్ ఆఫ్ కోటా' టీజర్ ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మహేశ్ బాబు తెలిపారు. దుల్కర్ సల్మాన్ ను మరోసారి ఆకట్టుకునే పాత్రలో చూస్తున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. యావత్ చిత్రబృందానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.
'కింగ్ ఆఫ్ కోటా' చిత్రం టీజర్ ను మహేశ్ బాబు విడుదల చేయడం పట్ల దుల్కర్ సల్మాన్ స్పందించారు. "థాంక్యూ సో మచ్ అన్నా" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్ బాబు వంటి అగ్రహీరో తమ చిత్రం టీజర్ విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. 'కింగ్ ఆఫ్ కోటా' చిత్రబృందం అంతా ఇప్పుడు సంతోషంతో పొంగిపోతుందని దుల్కర్ సల్మాన్ వివరించారు.
ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకుడు. ఇందులో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, డాన్సింగ్ రోజ్ షబీర్, ప్రసన్న, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్ ఇతర నటీనటులు. 'కింగ్ ఆఫ్ కోటా' చిత్రంలో దుల్కర్ ఓ గ్యాంగ్ స్టర్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం 80, 90వ దశకాల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్టు సమాచారం.
