టాలీవుడ్ సంక్రాంతి ఫైట్ కి కౌంట్ డౌన్ మొదలైంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అల్లు అర్జున్ - మహేష్ బాబు సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ మొదలైంది. అయితే సినిమాకు సంబందించిన యూఎస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. రెండు సినిమాలు ఓవర్సీస్ లో భారీ స్థాయిలో రిలీజ్ కానున్నాయి.

ప్రవాసులు కూడా పండగ సమయంలో తెలుగు సినిమాలను ఏ మాత్రం మిస్సవ్వరు.   అల వైకుంఠపురములో జనవరి 12న రిలీజ్ అవుతుండగా.. సరిలేరు నీకెవ్వరు జనవరి 11న రిలీజ్ కాబోతోంది. అయితే యూఎస్ లో మాత్రం ఈ రెండు సినిమాలు స్వదేశంలో కంటే ఒక రోజు ముందే రిలీజ్ కాబోతున్నాయి. యూఎస్ ప్రీమియర్స్ కి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇండియాలో మహేష్ బాబు - అల్లు అర్జున్ మధ్య బాక్స్ ఫైట్ కొనసాగుతుండగా.. యూఎస్ లో మాత్రం త్రివిక్రమ్ vs మహేష్ బాబు అన్నట్లుగా.. డాలర్స్ యుద్ధం నడుస్తోంది.  ఎందుకంటె మహేష్ బాబు గత సినిమాలు చాలా వరకు యూఎస్ లో భారీ వసూళ్లను అందుకున్నవే.

ఇక అల వైకుంఠపురములో సినిమాను డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్ గత సినిమాలు కూడా అమెరికాలో మిలియన్ డాలర్స్ అందుకున్నవే. బన్నీ క్రేజ్ కంటే త్రివిక్రమ్ మార్క్ అక్కడ ఎక్కువగా ఉపయోగపడనుంది. కేవలం మహేష్ క్రేజ్ ద్వారానే సరిలేరు యూఎస్ జనాలను ఆకర్షించనుంది. మొత్తంగా రెండు సినిమాల బిజినెస్ వరల్డ్ వైడ్ గా ఈజీగా 200కోట్లు దాటేస్తుందని టాక్ వస్తోంది. మరీ రెండు సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో చూడాలి.