సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో అభిమానులకు పోకిరి లాంటి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల మహేష్ బాబు, పరుశురాం దర్శత్వంలో చిత్రానికి ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి సర్కార్ వారి పాట అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ లోగోని రిలీజ్ చేశారు. 

ఈ లోగోలో మహేష్ బాబు గెటప్ ని శాంపిల్ చూపించారు. మహేష్ ఈ చిత్రంలో ఊరమాస్ లుక్ లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. చెవిపోగు పెట్టి, మెడపై రూపాయి టాటూతో కనిపిస్తున్న మహేష్ లుక్ అభిమానులు పండగ చేసుకునే విధంగా ఉంది. 

లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం దర్శకుడు కాస్టింగ్ ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన నటించే హీరోయిన్ విషయం హాట్ టాపిక్ గా మారింది. భరత్ అనే నేను చిత్రంలో నటించిన కియారా అద్వానీ మరోసారి మహేష్ తో రొమాన్స్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. 

తాజాగా మరో క్రేజీ బ్యూటీ పేరు వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 తో పరిచయమైన సయీ మంజ్రేకర్ తొలిచూపులోనే యువతని ఫిదా చేసింది. దర్శకుడు పరుశురామ్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే సయీ మంజ్రేకర్ నో చెప్పే ఛాన్సే లేదు.. ఎందుకంటే ఇది మహేష్ బాబు సినిమా కనుక.