దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. సమీర్ ఈ చిత్రానికి దర్శకుడు. హీరో విజయ్ దేవరకొండ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

నవంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. దీనితో ప్రచార కార్యక్రమాలని షురూ చూస్తున్నారు. రేపు(అక్టోబర్ 16 బుధవారం) మీకు మాత్రమే చెప్తా చిత్ర ట్రైలర్ రిలీజ్ కానుంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కానుండడం విశేషం. బుధవారం సాయంత్రం 4:04 గంటలకు ట్రైలర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్ చేశారు. 

ఈ చిత్రంలో వాణి భోజన్ హీరోయిన్ గా నటిస్తుండగా, యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా మీకు మాత్రమే చెప్తా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.