ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ - బన్నీ అభిమానుల మధ్య కామెంట్స్ ఫైట్ ఒక రేంజ్ లో నడుస్తోంది. సంక్రాంతి రేస్ లో అల వైకుంఠపురములో - సరిలేరు నీకెవ్వరు' సినిమాలు ఒకరోజు గ్యాప్ లోనే భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. దీంతో సినిమాలపై కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్స్ చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ హీట్ ఫిట్ ని మరింతగా హీటేక్కిస్తున్నారు.

అసలైతే మొదట్లో ఈ రెండు సినిమాలు విడుదల తేదీల కోసం చాలా పోటీ పడ్డాయి.  ఇరు చిత్రాల నిర్మాతల మధ్య చర్చలు గట్టిగానే నడిచాయి. అయితే ఫైనల్ గా థియేటర్స్ సంఖ్యను సర్దుబాటు చేసుకోవడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబందించిన బాక్స్  ఆఫీస్ ఫైట్ పై స్పందించాడు. అల వైకుంఠపురములో - సరిలేరు నీకెవ్వరు రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయని మొదట్లో వచ్చిన వార్తలపై మహేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

సినిమా ఎలాంటిదైనా సరే రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడం అంత మంచిది కాదు ఏదైనా ఒక సినిమాపై ఒక ఎఫెక్ట్ పడుతుంది. సోలో రిలీజ్ అయితే ఫైనాన్షియల్ గా సినిమాపై ఆధారపడిన బయ్యర్స్ కి సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెస్తుందని అన్నారు. ఏదేమైనా రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడం ఎవ్వరికి మంచిది కాదని మహేష్ క్లారిటీ ఇచ్చేశాడు.