టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన స్పెషల్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ప్రతిసారి మహేష్ తన పోస్టర్స్ విషయంలో రొటీన్ గానే ఆలోచిస్తున్నాడు అనే టాక్ ఇటీవల తెగ వైరల్ అయ్యింది. మొన్న చేతిలో రాడ్ పట్టుకున్న మహేష్ కొంచెం భరత్ అనే నేను పోలికలతో స్టిల్ ఇచ్చినట్లు టాక్ వచ్చింది.

ఇక చాలా ఏళ్లుగా మహేష్ ట్రేడ్ మార్క్ లుక్ ఏదైనా ఉందా అంటే.. సీరియస్ గా చూసుకుంటూ ఉరకడమే. మహేష్ పరుగును ఎవరైనా ఈజీగా ఇమిటేట్ చేస్తారు. అది మహర్షి వరకు కొనసాగింది. నెక్స్ట్ రానున్న సరిలేరు నీకెవ్వరు లో మాత్రం పరుగులు తీసే పని పెట్టుకోవడం లేదని అర్ధమవుతోంది. ఇక ఇప్పుడు బైక్ మీద వెళుతున్న స్టిల్ ని వదిలిన మహేష్ కాస్త కొత్తగా ట్రై చేశాడనిపిస్తోంది.  మహేష్ పేస్ లో మాత్రం ఏ మాత్రం మార్పులు లేవు.

ఎప్పటిలానే అదే హావభావాలు పలికించాడు. ఇక బైక్ వేసుకొచ్చి కాస్త కిక్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి తన హీరోలను చాలా వరకు కామెడీ యాంగిల్ లో ఎలివేట్ చేసి యాక్షన్ లో కూడా సాలిడ్ గా చూపిస్తాడు. మరి మహేష్ లాంటి స్టార్ హీరోను ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం చివరి షెడ్యూల్ ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్న మహేష్ రెగ్యులర్ ప్రమోషన్ ని మాత్రం డిసెంబర్ లో స్టార్ట్ చేయనున్నాడట.  

మరోవైపు అల్లు అర్జున్ పాటలతో రచ్చ మొదలెట్టాడు. అల.. వైకుంఠపురములో స్ట్రాంగ్ పోటీని ఇస్తుందని చెప్పవచ్చు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కూడా భారిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లిస్ట్ లో కొనసాగుతున్నాయి. కానీ ఇంకా మహేష్ నుంచి ఎలాంటి పాటలు రాలేదు. రెండు ఒకేసారి రిలీజ్ అవుతున్నప్పటికీ ప్రమోషన్స్ లో మాత్రం ఇప్పటికి మహేష్ కంటే బన్నీ స్పీడ్ మీద ఉన్నాడు. మరి సంక్రాంతి ఫైట్ లో ఎవరు అత్యధిక కలెక్షన్స్ ని అందుకుంటారో చూడాలి.