టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ బాబు మిలటరీ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను సంక్రాంతికానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, చిన్న చిన్న వీడియోలు రిలీజ్ చేశారు. తాజాగా సినిమా టీజర్ ని విడుదల చేశారు. 

Sarileru Neekevvaru: మహేష్ బాబు రెమ్యునరేషన్ లో కోత!

''మీరెవరో మాకు తెలియదు.. మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు.. కానీ మీకోసం, మీ పిల్లల కోసం పగలు రాత్రి, ఎండా.. వానా.. అని లేకుండా పోరాడుతూనే ఉంటాం.. ఎందుకంటే మీరు మా బాధ్యత'' అని మహేష్ బాబు చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. 

''మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలు రా.. మిమ్మల్ని ఎలా చంపుకుంటాను రా.. మీకోసం ప్రాణాలు ఇస్తున్నాం రా.. అక్కడ.. మీరేమో కత్తులు, గొడ్డల్లు వేసుకొని ఆడవాళ్ల మీద మీద కెల్తారా.. బాధ్యత ఉండక్కర్లా..'' అంటూ మహేష్ క్లాస్ పీకే సీన్ బాగుంది. 

'భయపడే వాడే బేరానికి వస్తాడు...మన దగ్గర బేరాలు లేవమ్మా' అంటూ మహేష్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. 

'గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్' అంటూ విజయశాంతి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. 

అలానే మహేష్ ని ఉద్దేశిస్తూ.. ప్రకాష్ రాజ్ 'ప్రతీ సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు' అని చెప్పే డైలాగ్ మహేష్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.