ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం పూర్తి స్దాయి ఫన్ తో రూపొందిందని, ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందని వినపడుతోంది. అదే సమయంలో ఈ చిత్రం బిజినెస్ కూడా ఓ రేంజిలో జరిగింది. అఫీషియల్ గా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పంపిణీదారుల లిస్ట్ బయిటకు వచ్చింది.

  నైజాం - శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్

సీడెడ్- సాయి చంద్ర ఫిల్మ్స్

కృష్ణా - క్రేజీ సినిమాస్

గుంటూరు - మెహర్ మూవీస్ వయా పద్మాకర్ సిన్మాస్  

వైజాగ్ - శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్

ఈస్ట్ గోదావరి - వింటేజ్ క్రియేషన్స్

వెస్ట్ గోదావరి - ఆదిత్యా ఫిల్మ్స్

నెల్లూరు - హరి పిక్చర్స్

కర్ణాటక - బృందా అశోశియోట్స్

చెన్నై - ఎస్ ఎస్ ఎసి మూవీస్

నార్త్ ఇండియా & ఒరిస్సా - పెన్ ఇండియా లిమిటెడ్

ఓవర్ సీస్ - గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ & AK ఎంటర్టైన్మెంట్స్

ఇక  చిత్రం బ్యాక్ డ్రాప్ మిలిట్రీ అని ప్రచారం జరుగుతోంది. కానీ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో కథ జరుగుతుందని వినికిడి. మహేష్ బాబు పాత్ర కర్నూల్ ప్రాంతానికి చెందిన వాడు అని, ఫ్యాక్షన్ హత్యలతో విసుగెత్తి మిలట్రీకు వెళ్తాడని చెప్తున్నారు.  సినిమా ప్రారంభానికి అక్కడ నుంచి తన సొంత ఊరుకు రావటం, అక్కడ జరిగే పరిణామాలు చుట్టూ కథ తిరుగుతుందని చెప్తున్నారు. అయితే మరి పాత సినిమాల్లో చూపిన విధంగా ప్యాక్షనిజం చూపటం లేదని, కొంచెం కొత్తగా ఉంటుందని చెప్తున్నారు.  

అందుకే మొదట్లో  ఈ సినిమాకు రెడ్డిగారి అబ్బాయి అని టైటిల్ అనుకున్నారట. ఇప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ కి గుర్తుగా చెప్పుకొనే కొండారెడ్డి బురుజు సెట్ లో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ  వార్తలకు బలం చేకూరుతోంది. ఇదే కనుక నిజమైతే మహేష్ ని మొదటిసారి పూర్తి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కథలో చూడటం  జరుగుతుందన్నమాట. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో విజయ శాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.