టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2020 సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో వచ్చి మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. చాలా కాలం తరువాత సరికొత్త కామెడీ యాంగిల్ తో కనిపించి సక్సెస్ అందుకున్న మహేష్ నెక్స్ట్ ఇంకాస్త పెద్ద సినిమాలతో హిట్స్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న మహేష్ వీలైనంత త్వరగా షూటింగ్ పనులను స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నాడు. అసలైతే మహేష్ నెక్స్ట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో వర్క్ చేయలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా సడన్ గా క్యాన్సిల్ అయ్యింది. ప్రస్తుతం పరశురామ్ సినిమాకు సంబందించిన పనులపై మహేష్ ఎక్కువగా ద్రుష్టి పెట్టాడు.  మార్చ్ 25న సినిమాను లాంచ్ చేసి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను మొదలుపెట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట.

అంటే సినిమాను ఇదే ఇయర్ లోనే రిలీజ్ చేయాలిని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గీత గోవిందం లాంటి బాక్స్ ఆఫీస్ హిట్ అనంతరం పరశురామ్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. నాగ చైతన్యతో ఒక సినిమాను సెట్స్ పైకి తెచ్చినప్పటికీ అతను కాస్త బిజీగా ఉండడంతో వెంటనే మహేష్ తో జాక్ పాట్ కొట్టేశాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ఆడియెన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుంధో చూడాలి.