కోలీవుడ్ హీరో కార్తికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మొదటి నుండి వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తాజాగా 'ఖైదీ' అనే సినిమాలో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మౌత్ టాక్ తోనే ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ సినిమాని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా పాజిటివ్ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు, మెగా డాటర్ నీహారిక సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పోస్ట్ లు పెట్టారు.

ముందుగా మహేష్.. ''ఖైదీ.. న్యూ ఏజ్ ఫిలిమ్ మేకింగ్‌. గ్రిప్పింగ్ స్క్రిప్ట్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, అద్భుత‌మైన పెర్ఫామెన్స్‌ లున్నాయి. పాట‌లు లేవు. ఈ మార్పుకు స్వాగ‌తం. కార్తి, న‌రేన్, డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌క‌రాజ్‌ స‌హా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు'' అంటూ రాసుకొచ్చారు.

 

 

అలానే నీహారిక తన ట్విట్టర్ ఖాతా వేదికగా 'ఖైదీ' చిత్రబృందాన్ని ప్రశంసించారు. 'ఖైదీ' చిత్రంలోని ప్రతి సన్నివేశం  తనకు ఎంతగానో నచ్చిందని.. కార్తి నటన చంపేసేలా ఉందని రాసుకొచ్చింది. దిల్లీ పాత్రను బాగా ఎంజాయ్ చేశానని.. లోకేష్ కనకరాజు తెరకెక్కించిన తీరు అధ్బుతంగా ఉందని చెప్పింది.

నేపధ్య సంగీతం బాగుందని, ఇంతటి మంచి చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతతో పాటు చిత్రబృందానికి అభినందనలు అంటూ రాసుకొచ్చింది.