ప్రముఖ వ్యాపారవేత్త, జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. మహేష్ మేనల్లుడైన అశోక్ మొదటి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో డిఫరెంట్ యాక్షన్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఆ ప్రాజెక్ట్ లో సీనియర్ యాక్టర్ జగపతి బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.
పార్లమెంట్ సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త, జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. మహేష్ మేనల్లుడైన అశోక్ మొదటి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో డిఫరెంట్ యాక్షన్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఆ ప్రాజెక్ట్ లో సీనియర్ యాక్టర్ జగపతి బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

గతకొంత కాలంగా అశోక్ సినిమాలో ఒక సీనియర్ నటుడు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఫైనల్ గా నేడు చిత్ర యూనిట్ ఆ రూమర్స్ పై ఒక క్లారిటీ ఇచ్చింది. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఇప్పుడు ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు అని తెలియగానే సినిమాపై అంచనాల డోస్ పెరిగింది. జగపతిబాబు రోల్‌కు చాలా ప్రాముఖ్యత ఉందట. త్వరలోనే సినిమాకు సంబందించిన టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ శుక్రవారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం .. రిచర్డ్ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చంద్ర శేఖర్ రావిపాటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
