మహేష్ ఈ ఏడాది మహర్షి చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. అదే ఉత్సాహంతో ప్రస్తుతం ఆర్మీ మేజర్ గా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా మహేష్ బాబు నేడు విజయవాడలో పర్యటించాడు. 

ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ షోరూం ప్రారంభోత్సవానికి మహేష్ హాజరయ్యాడు. దీనితో మహేష్ ని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున ఎగబడ్డారు. మహేష్ బాబు వస్తుండడంతో పోలీసులు కూడా చేరుకొని భద్రత కల్పించారు. 

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. విజయవాడతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. విజయవాడలో తాను నటించిన ఎన్నో చిత్రాలు ఈవెంట్స్ జరిగాయని మహేష్ పేర్కొన్నాడు. 

ఈ సందర్భంగా మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్ర గురించి ప్రస్తావించాడు. నా కొత్త చిత్రం సంక్రాంతికి విడుదుల కాబోతోంది. సరిలేరు నీకెవ్వరు అభిమానులు గర్వపడేలా ఉంటుందని మహేష్ ప్రస్తావించాడు.