దిమ్మతిరిగేలా ‘గుంటూరు కారం’బిజినెస్,లెక్కలు ఇవిగో
మహేశ్ పూర్తి మాస్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ఆయన సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి ఆడిపాడనున్నారు.

మామూలుగానే మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా సినిమా అంటేనే భాక్సాఫీస్ దగ్గర ఊపు మామూలుగా ఉండదు. అందులోనూ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రత్యేకంగా చెప్పాలా..దాదాపు 12 సంవత్సరాల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రూపొందిస్తోన్న చిత్రం ‘గుంటూరు కారం’(Guntur Kaaram).రీసెంట్ గా త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తొలిపాట ‘దమ్ మసాలా బిర్యానీ..’ను చిత్రటీమ్ విడుదల చేసింది. ఈ పాట ప్రోమోలో మహేశ్ స్టైల్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్ లో ఈ పాట జోష్ నింపేసింది. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజిలో మొదలైంది. నిర్మాత నాగవంశీ బిజినెస్ కాల్స్ తో బిజీగా ఉంటున్నారు. పెద్దగా నెగోశియేషన్స్ లేకుండానే ఏరియాలు లాక్ అయ్యిపోతున్నాయట. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆంధ్రా 50 కోట్లు దాకా, నైజాం 45 కోట్లు దాకా చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి డిటేల్స్ త్వరలో బయిటకు రానున్నాయి.
ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని ప్రచారం మొదలైంది. గతంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు గుంటూరు కారం సినిమాకు చిన్న లింక్ పెడుతూ ఎన్టీఆర్ ను గుంటూరు కారం సినిమాలో చూపించనున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. అందుకోసమే కథలో చాలా మార్పులు చేర్పులు చేశారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే గుంటూరు కారం సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ , ధమ్ మసాలా సాంగ్ సినిమా పై అంచనాలను పెంచేశాయి.
మహేశ్ పూర్తి మాస్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ఆయన సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి ఆడిపాడనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.