కరోనా భయంతో సామాన్య ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా ఎప్పుడూ షూటింగ్ లతో కుటుంబానికి దూరంగా ఉండే టాప్ స్టార్స్‌ ఇప్పుడు షూటింగ్ లకు బ్రేక్ పడటంతో ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ సమయాన్ని తమ కుటుంబం తో కలిసి సరదా గడిపేందుకు వినియోగించుకుంటున్నారు స్టార్స్‌. ఇక ఎప్పుడూ  ఖాళీ దొరికినా ఫ్యామిలీతో సమయం గడిపేందుకు ఇంపార్టెన్స్ ఇచ్చే మహేష్ బాబు ఇంట్లోనే ఉండి పిల్లలతో సరదాగా కాలం గడుపుతున్నాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న మహేష్ బాబు ఇంత వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. ముందుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించినా ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు. అదే సమయంలో కరోనా కారణంగా షూటింగ్ లకు సినిమా కార్యక్రమాలకు బ్రేక్ పడటంతో ఇంట్లోను ఉంటున్న మహేష్ పిల్లలతో కలిసి సరదాగా టైం పాస్ చేస్తున్నాడు.

కూతురు సితారతో కలిసి మహేష్ బాబు అల్లరి చేస్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసిన నమ్రత `ఇప్పుడే మొదలైంది. 21 రోజుల లాక్‌ డౌన్‌ ప్రకటించిన సందర్భంగా ఎక్కువ రోజులు నాన్న కలిసి ఉండొచ్చు అన్న ఆనందంలో సితార అల్లరి` అంటూ కామెంట్ చేసింది.