సూపర్ స్టార్ మహేష్ బాబు తన వృత్తి కోసం ఎంతటి డెడికేషన్ చూపిస్తాడో.. కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు. తన తల్లి, సతీమణి నమ్రత, కుమార్తె సీతారపై మహేష్ అమితమైన ప్రేమని ప్రదర్శిస్తాడు. మరోమారు ఈ ముగ్గురిపై మహేష్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. 

నేడు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహేష్ బాబు ట్వీట్ చేశాడు. నా ఈ జీవితానికి, ఉనికికి కారణం ఈ ముగ్గురే. మహిళలందరికీ బలం చేకూరాలి అని మహేష్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. మహేష్ ట్వీట్ అభిమానులని ఆకట్టుకుంటోంది. 

ఇక అక్కినేని హీరో అఖిల్ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశాడు. తన తల్లి అక్కినేని అమలతో ఉన్న ఫోటోలని షేర్ చేశాడు. నా జీవితానికి వెలుగు అయిన నా తల్లికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మీరు లేకుంటే ఈ ప్రపంచానికి వెలుగు లేదు అని అఖిల్ ట్వీట్ చేశాడు.