టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయశాంతి సరికొత్త పాత్రలో నటిస్తుండడంతో ఆమె రీ ఎంట్రీ పై కూడా అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాతో ఆడియెన్స్ కి సరికొత్త కిక్ ఇవ్వనున్నట్లు మహేష్ చాలా నమ్మకంగా ఉన్నాడు.  సినిమాకు బజ్ స్ట్రాంగ్ గానే ఉన్నప్పటికీ ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గకూడదని మహేష్ ప్లాన్ వేసుకున్నాడట. ఇప్పటికే సినిమా షూటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగాన్ని అందుకున్నాయి.

అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 5న గ్రాండ్ గా నిర్వహించాలని మహేష్ ఫిక్స్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా వేడుకకి ముఖ్య అతిధిగా రాబోతున్నారు. అయితే ఇవన్ని కాకుండానే సినిమాపై మరింత క్రేజ్ పెరిగేలా మహేష్ కొత్త ప్లాన్ వేశాడట.  తనను ఎంతగానో ఇష్టపడే అభిమానుల్ని డైరెక్ట్ గా కలుసుకోవాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.

ప్రెస్ మీట్స్ తో పాటు ఫ్యాన్స్ మీట్ అంటూ వీలైనంత వరకు ఘట్టమనేని అభిమానులతో మహేష్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అందుకు ఘట్టమనేని అభిమాన సంఘాలు మహేష్ కి సాయం చేయనున్నాయి.  వారు సెలెక్ట్ చేసిన అభిమానులను మహేష్ మీటింగ్ లో డైరెక్ట్ గా మాట్లాడనున్నారు.

సాధారణంగా మహేష్ తన అభిమానులతో చాలా సరదాగా మాట్లాడుతుంటాడు. దీంతోజోకులు పంచ్ లు వేయడంలో మహేష్ దిట్ట. ఇక ఈ సారి కూడా అలంటి రిఫ్రెషింగ్ మూమెంట్స్ తో ఓ వైపు ఆడియెన్స్ ని ఖుషి చేస్తూనే సినిమా ప్రమోషన్స్ డోస్ ని పెంచనున్నారు. మరి ఈ ప్లాన్ సినిమాకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.