ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేధనిపించే మంచి లాభాలనే అందించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబందించిన ఒక ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.  

తమన్నా స్పెషల్ గా చేసిన 'డాంగ్ డాంగ్' సాంగ్ పెద్దగా క్లిక్కవ్వకపోయినా మేకింగ్ పరంగా ఆకట్టుకుంటోంది. మహేష్ స్టైల్ లో తమన్నా గ్లామర్ గట్టిగానే వర్కౌట్ అయ్యింది. మాస్ ఆడియెన్స్ ని ఈ సాంగ్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. ఇక సాంగ్ రిలీజైన కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన కలెక్షన్స్ తగ్గుతున్నాయని టాక్ వస్తోంది.

 ఇక మహేష్ నెక్స్ట్ మహర్షి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టిచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మహేష్ వర్క్ చేయబోతున్నాడు. ఆ సినిమాలో మహేష్ ఒక స్పైగా కనిపించబోతున్నాడట. ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్న దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేసాడు. అయితే గతంలో మహేష్ స్పైడర్ సినిమాలో స్పై గా కనిపించి ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సక్సెస్ అందుకోవాలని కాస్త కొత్తగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక వంశీ పైడిపల్లి సినిమా తరువాత మహేష్ అనిల్ రావిపూడితో కూడా మరో సినిమా చేయాలనీ ఆలోచిస్తున్నాడు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ అందుతున్నాయి. అనిల్ సుంకర - దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.  వరుస షూటింగ్ లతో గత ఏడాది నుంచి బిజీగా ఉంటున్న మహేష్ రెస్ట్ తీసుకొని చాలా కాలమవుతోంది. ఇక ఇప్పుడు రెండు నెలల పాటు షూటింగ్ ప్రపంచానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. అమెరికాలోనే తన స్నేహితులతో అలాగే సన్నిహిత బంధువులతో ఏకాంతంగా గడపాలని డిసైడ్ అయ్యాడట.మార్చ్ తరువాత ఇండియాకు రాగానే కొత్త సినిమాని మొదలుపెట్టనున్నాడు.