నచ్చిన విషయాన్ని , సినిమాని మెచ్చుకోవటంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటారు. అది చిన్న సినిమా కావచ్చు, పరభాషా చిత్రం కావచ్చు తనకు నచ్చితే తన అభిమానులకు రికమెండ్ చేసే విధంగా ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో రాస్తారు. ఆ ప్రశంసలు ఆ సినిమా దర్శక,నిర్మాతలకు ఆనందాన్ని కలిగిస్తాయనటంలో సందేహం లేదు. తాజాగా ఆయన ధనుష్ హీరోగా వచ్చిన అసురన్ చిత్రం గురించి ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరిచారు.

కలైపులి థాను నిర్మాణంలో వెట్రిమారన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా నటించిన చిత్రం ‘అసురన్‌’. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా మలయాళ నటి మంజువారియర్‌ నటించింది. అభిరామి, అరుణాచలం, బాలాజీ శక్తివేల్‌, ప్రకాశ్‌రాజ్‌, కరుణాస్‌, పశుపతి, సుబ్రహ్మణ్యశివ, ఆడుగలం నరేన్‌, నితీష్‌లు ఇతర తారాగణంగా వచ్చిన ఈ చిత్రానికి.... జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చారు. వేల్‌రాజ్‌ సినిమాటోగ్రఫీ అందించారు.

 ఇటీవల విడుదలైన ఈ సినిమాకు  అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ధనుష్‌ ఫ్యాన్స్ ఈ  సినిమాపై భారీ ఎక్సపెక్టేషన్స్  పెట్టుకున్నారు. ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద హిట్ అవటం, విమర్శకుల నుంచి ప్రశంసలు రావటంతో ఫుల్ పండగ చేసుకుంటున్నారు. మరో ప్రక్క కేవలం పది రోజుల్లో వంద కోట్ల క్లబ్ లో చేరింది సినిమా. ఈ నేపధ్యంలో మహేష్ బాబు సైతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో మాట్లాడారు.

‘వెక్కై’ అనే నవలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేసాడు. స్నేహ, మంజు వారియర్‌ హిరోయిన్లుగా నటించారు. మలయాళ ముద్దుగుమ్మ మంజు ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. గురు సోమసుందరం, పశుపతి, యోగి బాబులతో పాటు దర్శకుడు బాలాజీ శక్తివేల్‌ గెస్ట్‌రోల్‌లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ సంగీతం సమకూర్చాడు.