సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఇంటికి వెళితే మాత్రం ఫ్యామిలీ స్టార్ అయిపోతారు. తన కుటుంబంతో ఎంత చక్కగా కలిసి ఉంటాడో అది అందరికి తెలిసిన విషయమే. నెలకో వెకేషన్ అంటూ పిల్లలతో సమయాన్ని గడుపుతుంటారు. బిజీబిజీగా గడిపే స్టార్స్ కి మహేష్ ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నాడని చెప్పవచ్చు.

అయితే ఈ ఫ్యామిలీ పర్సన్ ఇలా క్రమశిక్షణతో ఫ్యామిలీని లీడ్ చేయడానికి గల కారణం బయటకు వచ్చింది. మహేష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు."నమ్రత నేను ఒకరినొకరం బాగా అర్ధం చేసుకున్నాం. మా పెళ్లి జరిగి 14 ఏళ్ళవుతోంది. వివాహ బంధం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఓకే ఒక్క సీక్రెట్ ఉంది. అది ఫాలో అయితే చాలు. కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపాలి. నేను అదే చేస్తున్నా. నా తండ్రి నుంచి ఈ విషయాన్నీ నేర్చుకున్నా. ఆయన కూడా ఇంటికి రాగానే కుటుంబంతో కలిసిపోయేవారు.  

టాప్ స్టార్ హీరో అనే హోదాను మరచి మాకు సమయాన్ని కేటాయించేవారు. ఆయన నేర్పిన బాటలోనే నేను కూడా నడుస్తున్నాను" అని మహేష్ తన ఫ్యామిలీ గురించి వివరణ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.