ఫిల్మ్ స్టార్స్ కు అభిమానులు ఉంటారు.. వీరాభిమానులు ఉంటారు. వారి అభిమానాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా చాటుకోవాలి అని ఆరాటపడుతుంటారు. అలాంటి అభిమానే హీరో నానీపై డిఫరెంట్ గా అభిమానానన్ని చాటుకున్నాడు.
ఫిల్మ్ స్టార్స్ అంటే పిచ్చెక్కిపోతుంటారు అభిమానులు. కొంత మంది వీరాభిమానులు తమ కోసం ఏదో కొత్తగా చేయాలి అని ఆరాటపడుతుంటారు. ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతోంది. ఒక్క తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఎన్నో విజయాలు సాధిస్తోంది తెలుగు సినిమా. అంతే కాదు తెలుగు హీరోలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో అభిమానుల్ని సాధించుకుంటున్నారు. ఈ క్రమంలో వారు కూడా తమ అభిమానాన్ని డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమధ్య రామ్ చరణ్ కోసం ఓ రైత్ తన పొలంలో చరణ్ ముఖం వచ్చే విధంగా పంట పండించాడు. ధాన్యంతో చరణ్ ముఖం తయారు చేయింది బహుమతిగా ఇచ్చాడు.
స్టార్స్ కోసం అతభిమానులు చేసిన పనులు ఇలా చాలా ఉన్నాయి. ఇక రీసెంట్ ఓ అభిమాని మన న్యాచురల్ స్టార్ నానిపై తనకున్న అభిమానం వెరైటీగా చూపించాడు. అది కూడా తెలుగు అతభిమాని కాదు..మరాఠా అభిమాని నానీ కోసం కొత్తగా ట్రైచేశాడు. మహారాష్ట్ర కు చెందిన విపుల్ మిరాజ్‌కార్ అనే ఓ ఆర్టిస్ట్ రకరకాల బొమ్మలు, పెయింట్స్ వేస్తూ ఉంటాడు. రంగులతో బొమ్మలని గీస్తూ ఉంటాడు. నాని దసరా సినిమా మార్చ్ 30న రిలీజ్ ఉండటంతో నాని పై అభిమానంతో విపుల్ మిరాజ్‌కార్ ఓ డాబాపై 30 అడుగులతో నాని దసరా లుక్ ని గీసి న్యాచురల్ కలర్స్ తో ఆ బొమ్మని నింపాడు.
అయితే అది అచ్చంగా కలర్ ప్రింట్ తీసినట్టు అద్భుతంగా గీశాడు. ప్రస్తుతం ఈ ఫోటో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విపుల్ మిరాజ్‌కార్ తో పాటు అతనికి తన ఫ్రెండ్స్ కూడా సాయం చేయడం విశేషం. ఈ బొమ్మను గీయడంలో వారు కూడా పాలు పంచుకున్నారు. ఇక ఈ బొమ్మను వేస్తున్న వీడియోను డ్రోన్ ద్వారా క్యాప్చర్ చేసి.. బోమ్మ వేసిన తరువాత కూడా వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోకి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఆ ఆర్టిస్ట్ ను తెగ అభినందిస్తున్నారు నెటిజన్లు.
దసరా సినిమాతో కాస్త డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈమూవీలో నానీ జతగా కీర్తి సురేష్ కనిపించబోతోంది. ఈమూవీని మార్చ్ 30 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఎక్కువగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు నానీ. ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. దసరా సినిమాను శ్రీకాంత్ ఓదేలు డైరెక్ట్ చేస్తున్నారు.
