Asianet News TeluguAsianet News Telugu

లిప్ లాక్ సీన్లకు నో.. సినిమా షూటింగ్స్ కి మహారాష్ట్ర సీఎం గ్రీన్ సిగ్నల్.. వాళ్లకు పండగే..

దాదాపు రెండు నెలలకు పైగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశ ఆర్థిక పరిస్థితిని,ఉపాదిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు క్రమంగా లాక్ డౌన్ నిబంధనల్ని సడలిస్తున్నాయి.

Maharashtra allows film and TV shoot with 16 page long set of guidelines
Author
Hyderabad, First Published Jun 1, 2020, 7:35 PM IST

దాదాపు రెండు నెలలకు పైగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశ ఆర్థిక పరిస్థితిని,ఉపాదిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు క్రమంగా లాక్ డౌన్ నిబంధనల్ని సడలిస్తున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్స్ కు అనుమతి ఇవ్వాలంటూ ఆయా రాష్ట్రలో సినీ ప్రముఖులు ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. 

సినిమా, టివి టీవీ రంగం మీద ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే తమ రాష్ట్రంలో సినిమా, టివి షూటింగ్స్ కు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానీ తప్పనిసరిగా షూటింగ్ సమయాల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. ఈ మేరకు నిర్మాతలకు మహారాష్ట్ర ప్రభుత్వం 16 పేజీల గైడ్ లైన్స్ విడుదల చేసింది. 

ప్రతి చిత్ర యూనిట్, టివి కార్యక్రమాల, సీరియల్స్ యూనిట్స్ ఈ నిబంధనల్ని పాటించాల్సిందే. మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం..  సంఖ్యలో నటీనటులు, సిబ్బందితో మాత్రమే షూటింగ్ జరగాలి. సెట్స్ లో అన్నిరకాల పారిశుధ్య చర్యలు తీసుకోవాలి. 

కొన్ని రకాల సన్నివేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. లిప్ లాక్ సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్స్, భారీ స్థాయిలో జరిగే పెళ్లి సన్నివేశాలు, ఫైట్స్.. భారీ స్థాయిలో జూనియర్ ఆర్టిస్టులో ఒక్క చోట చేరే సన్నివేశాలు, మార్కెట్, షాపింగ్ మాల్స్ లో చిత్రీకరించే సన్నివేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 

అలాగే చిత్ర టెక్నీషియన్లలో గర్భవతిగా ఉండే మహిళలు ఉండకూడదు. అలాగే నటీనటుల, టెక్నీషీన్ల భార్యలు గర్భవతి అయినా కూడా షూటింగ్స్ కు రాకూడదు. సెట్స్ లో అంబులెన్స్, వైద్యుడు, నర్స్ తప్పనిసరిగా ఉండాలి. నటీనటులు మేకప్ సొంతంగా వేసుకోవాలి.. మేకప్ కిట్స్ కిట్స్ ఎవరికి వారివి ప్రత్యేకంగా ఉండాలి. షూటింగ్స్ కేవలం నాన్ కంటైన్మెంట్ జోన్లలోనే నిర్వహించుకోవాలి. 

సిబ్బంది మాస్కులు ధరించడం తప్పనిసరి. షూటింగ్ లొకేషన్ లో గేట్లని తాకకుండా సెక్యూరిటీ గాడ్ లని నిమించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ నిబంధనలు సినిమా యూనిట్ కి కష్టమైనవే. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న చిన్న సన్నివేశాలు మినహా మిగిలినవి షూట్ చేసుకునే వీలు లేదు. 

కానీ ఈ నిబంధనలు టివి రంగానికి పెద్ద అడ్డంకి కాకపోవచ్చు. ఎందుకంటే టివి సీరియల్స్, కార్యక్రమాలు పరిమిత సంఖ్యలో ఉండే సిబ్బంది, నటీనటులతోనే జరుగుతాయి. కాబట్టి మహారాష్ట్రలో టీవీ రంగానికి పండగే. 

Follow Us:
Download App:
  • android
  • ios