నేను శైలజ చిత్రంతో కీర్తి సురేష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం నుంచే కీర్తి సురేష్ సినీప్రియుల హృదయాలు దోచుకుంది. మహానటి చిత్రంతో అయితే కీర్తి సురేష్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నట విశ్వరూపం ప్రదర్శించింది. 

ఏకంగా ఆ చిత్రానికి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రలో ఒదిగిపోయేందుకు కీర్తి సురేష్ కొంత బరువు కూడా పెరిగింది. ఆ చిత్రం తర్వాత వర్కౌట్స్ చేసి సన్నబడింది. కీర్తి సురేష్ అనూహ్యంగా బరువు కోల్పోవడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. 

ప్రియమణి స్టన్నింగ్ హాట్.. ఇంత అందాన్ని వెండితెరపై మిస్సవుతున్నామే..

కీర్తి సురేష్ ఇంతవరకు వెండితెరపై హద్దులు దాటే విధంగా అందాలు ఆరబోయలేదు. మోడరన్ డ్రెస్సుల్లో మెరిసినప్పటికీ గ్లామర్ ఒలకబోయలేదు. తదుపరి చిత్రాల్లో కీర్తి సురేష్ అందాలు ఆరబోయనుందని.. బికినిలో కనిపించనుందని ప్రచారం జరిగింది. అందుకోసమే కీర్తి సురేష్ బరువు తగ్గి సన్నగా మారిందని ఊహాగానాలు వినిపించాయి. 

ఈ ఊహాగానాలకు అదిరిపోయే సమాధానం ఇచ్చిన కీర్తి సురేష్ అందరి నోళ్లు మూయించింది. తాను తన ఆరోగ్యం కోసం, ఫిట్ గా ఉండడం కోసం బరువు తగ్గానని.. బికినీ వేసుకోవడం కోసం కాదని కీర్తి సురేష్ తెలిపింది. తాను ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని కీర్తి సురేష్ తెలిపింది.