మెగాస్టార్ చిరంజీవికే కాకుండా ఇతర ప్రముఖులకు భారీ ఊరట లభించింది. తన అభిమానులకు చిరంజీవి శుభవార్తను అందించారు తనకు కరోనా సోకలేదని స్ప,ష్టం చేశారు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయం వెల్లడించారు. 

ఈ సందర్భంగా చిరంజీవి ఈ  విధంగా స్పందించారు. గత నాలుగు రోజులుగా కరోనాతో ఓ ఆట ఆడుకుందని చెప్పుకొచ్చారు. ఆదివారం కరోనా టెస్ట్ చేయించుకుంటే.. రిజల్ట్ పాజిటివ్ రావడంతో బేసిక్ మెడిటేషన్ స్టార్ట్ చేసినట్టు చెప్పారు.

రెండు రోజులు తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో అపోలో డాక్టర్స్‌ను సంప్రదించినట్టు తెలిపారు. అక్కడ CT స్కాన్ చేయడంతో చెస్ట్‌లో ఎలాంటి ట్రేసెస్ లేవన్నట్టు డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత టెస్టులో కరోనా నెగిటివ్ వచ్చింది.

ఎందుకైనా మంచిదని Tenet ల్యాబ్‌లో మూడు రకాల కిట్స్‌తో టెస్ట్ చేయించాను. కానీ ఫలితం మాత్రం నెగిటివ్ వచ్చింది. ఫైనల్‌గా ఆదివారం తనకు తనకు పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చిన RT PCR టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్ట్ ఫాల్టీ కిట్ వలన వచ్చిందని డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు.

తనకు కరోనా సోకిన విషయం తెలుసుకున్న అభిమానులతో పాటు సన్నిహితులు తన ఆరోగ్యం మెరుగు పడాలంటూ చేసిన పూజలకు, ప్రార్దనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. చిరంజీవికి కరోనా నెగిటివ్ రావడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.