'మా అసోసియేషన్' మీటింగ్ నిర్వహిస్తే అధ్యక్షుడిగా నా అనుమతి ఉండాలి. ఆదివారం జరిగిన మీటింగ్ కు నా అనుమతి లేదు. అందుకే తాను హాజరు కాలేదు అని నరేష్ తెలిపారు. జీవితా, రాజశేఖర్ పేరు ప్రస్తావించకుండానే ఇది ఒక పనికిమాలిన మీటింగ్ అని నరేష్ అభివర్ణించారు. 

తాను మా అసోసియేషన్ మీటింగ్స్ కు అడ్డుపడుతున్నానని ఆరోపిస్తున్నారు. మా అధ్యక్షుడిగా నేను అడ్డుపడడం ఏంటి.. ఏదైనా మీటింగ్ జరిగితే నా ద్వారానే జరగాలి. అయినా కూడా ఇది ఫ్రెండ్లీ మీటింగ్ అని, కొందరుఅత్యవసర సమావేశం అని హడావిడి చేశారు. అందుకే నేను ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. 

సంక్రాంతికి విడుదల కాబోయే ఓ చిత్ర షూటింగ్ ఆదివారం జరిగింది. ఆ చిత్రానికి నేను డేట్స్ ఇచ్చాను. నటుడిగా నటన నా మొదటి భాద్యత. మా అసోసియేషన్ మీటింగ్ కు హాజరు కాకపోవడానికి అది కూడా ఓ కారణం. నేను హాజరు కాకపోవడమే మంచిదైంది. 

రెండు రాష్ట్రాల్లో నలువైపులా నుంచి అత్యవసరంగా సభ్యులని పిలిచి మీటింగ్ నిర్వహించారు. కనీసం 70 మంది కూడానా హాజరు కాలేదు. పృథ్వి ఈ మీటింగ్ పనికిమాలినది అని అన్నారు. ఆయన చాలా బాగా మాట్లాడారు. చివరకు పరుచూరి లాంటి పెద్దల మాటలని కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఆయన భాదపడుతూ వెళ్లిపోయారు. ఇలాంటి మీటింగ్ కు నేను హాజరు కాకపోవడమే మంచింది. 

ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు లాంటి పెద్దలు మా అసోసియేషన్ కోసం పనిచేశారు. ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పెద్దల సలహాలు తీసుకోవాలి. నేను అలాగే ముందుకు వెళతాను అని నరేష్ వివరణ ఇచ్చారు. 

మా అసోసియేషన్ మీటింగ్ పై జీవిత వాదన మాత్రం భిన్నంగా ఉంది. 1000 మంది సభ్యులు ఉన్న మా అసోసియేషన్ లో ఏదైనా మీటింగ్ నిర్వహించాలి అంటే 20 శాతం సభ్యుల మద్దతు ఉండాలి. మాకు 200 మంది సభ్యులు మద్దతు తెలిపారు. అందుకే ఈ సమావేశం నిర్వహించాం అని జీవిత అన్నారు.